అంతర్జాలము అదో మాయజాలము

అంతరజాలమ్ము నందలేదయనుచు
చింపాజి యీరీతి చింతసేసె
ప్రొద్దగడుచుతీరు పొడగట్టదిపుడు
ఏమిచేయదగునొ యెరుకలేదు
మోముపొత్తమునందుముచ్చటల్ సేయగా
ఏరీతియగునింక యెరుగలేను
వాట్సపులోనింక వార్తలు పంపగా
వసతిలేదాయనో వంత మిగిలె
నర్మసచివులెల్ల నవ్విపొవుటలాయె
ఏరీతిగడుచునో  యీదినమునాకు
మాకుయీరీతైనమానవులేరీతి
స్పందింతురోయంచు సందీయమ్మె
ఆ.వె.ఇట్టి కష్టమెపుడుయికముందులేకుండ
దారివెదుకవలయు తప్పకుండ
నేర్పశక్యమగును మాన్పనేరితనము
కొత్త కష్టమొచ్చెకువలయాన
(రచన:--విద్వాన్ గొల్లా పిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత