గార్ధభము- గద్దె

గార్ధభాన్నికాస్త గద్దెనెక్కింపగా
కార్యకర్తలెల్ల కష్టపడిరి
ఎట్లు దించవలెనొ యెరుకలేకయిపుడు
తలలు పట్టుకొనుట తప్పదాయె

గార్ధభాసురుండు కలికాల మందును
ఇలకు దిగిన యట్లు యెరుకయాయె
బలముచాలగలగు బలరాముకొరకునై
వెదకులాటమిగిలె విసుగు చెంది
రజకునొద్దజేరి రభసంబుజేయుచు
మూడు రేవులింక ముఖ్యమనుచు
ధవళ వస్త్ర చయము  ధావళ్యమొందగా
పృనకమ్ముకాస్త పూనె నిపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత