ఇది శంకరులు

మాహేశ్వరుండంతమళయాళదేశాన
ఆర్యాంబగర్భానయవతరించి
వేదోక్త ధర్మాన్ని విశ్వానకందించ
చిన్మయమూర్తియౌశివుడుతాను
అద్వైతతత్త్వమేయంతిమసత్యంబు
జ్ఞానపోలభ్ధిచే జ్ఞాతమగును
బ్రహ్మమే సత్యంబుపరతత్త్వమదియేను
మిథ్యగాజగతంతమిగిలిపోవు
ప్రాతిభాసికమంత పరమసత్యమనుచు
పామరత్వంబుచే భ్రాంతి పడిన
జన్మముల్ యెత్తగా జాడ్యంబు కలుగును
ఆ.వే. రజ్జు సర్ప భ్రాంతి రహితమౌ పరమార్థ
సత్య మొకటె మనకు నిత్య మయ్య
జ్ఞాన గమ్య మయుని జ్గాతంబు చేయగా
గురువు నాశ్ర  యింప వలయు గుర్తు గాను 
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత