గజేంద్ర మోక్షం

కరిమకరికదనము కదిలించు మనసంత
మకరిపై మనకంత మత్సరమ్ము
తాదాత్మ్య భావన  తపనతో మనసంత
తల్లడిల్లిన యట్లు తప్పదోయి
వేయ్యేండ్లయుధ్ధము వెనుకంజవేయక
పోరాడినట్టిదౌ పౌరుషమ్ము
ఆవిరైపోయ్యేటి యాపద లోనుండి
కమలాప్తకరుణించి కాపాడమన్నంత
కన్నీరు కాల్వలై  కడకుపారు
భక్తజనుల పైని పరమమౌప్రేమతో
తరలివచ్చెనుగాదె తాను భువికి
చక్రంబు చేబూని వక్రాన్ని నరికేయ
మనకంతమోదంబు మరలివచ్చె
ఆనందముప్పొంగి యశ్రువులంతయు
జలలపారెగ జలధియట్లు
(సశేషము)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత