చంద్రశేఖర మానసిక పూజ

చందన చర్చతో చంధ్రశేఖరుఫూజ
చేయదలచినాను చేతులార
దురితంబు లెల్లను దూరమెనరజేయు
దురాతారికర్పింతు ధూపసమితి
చిరుదివ్వె వెలిగించి చైతన్యమూర్తని
కనులారతిలకింతు కనులపంట
పంచభక్ష్యాలతో పానకంబర్పించి
వేవేగ తినమంటు వేడుకొందు
కప్పురంపు విడెము.కామేశుకర్పింతు
ఆచమించమనచునంబువునర్పించు
నీలకంఠుడిడిగొ నీరాజనంబని
సేవసేతునయ్య చేతులార
మంత్రమే పుష్పంగ మనసార నర్పింతు
మదిలోన నేనంత మౌననియతి
కాయంబుచేతను కావించు పనులెల్ల
మదిలోని మెదిలెటి మాటలెల్ల
మాటయే మంత్రమై మందార పుష్పంగ
మాహేశు చరణాల మనసునిండ
రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)
[హంపీ విరూపాక్ష స్వామికి సభక్తికంగా]

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత