బాహుబలుడు

తనదుబలహినతల్ తానెరిగినయట్టి
మనుజుండు లోకాన బాహు బలుడు
తనలోని లోపాలు తానెరిగినయట్టి
నరుడుసుందరుడౌను ధాత్రిలోన
తనలోని తప్పులు తానెరుగునరుడు
బుధ్ధిమంతుడనవచ్చుభూమి యందు
ఆత్మస్తుతికతడు .నణుమాత్ర మెరకాక
పరనిందచేయని భవ్యగుణుడు
ఆ.వే.తెలివి తేటలున్న తేకువ గలవాడు
మంచిముత్యమతడు మనుజులందు
ఇట్టి వాని మొత్రి యెంతైన మంచిది
చేయు వలయు మనము స్నేహ మెపుడు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత