గీతోపదేశము

కృపణత్వ భావమ్ము హృదయాన్ని బాధించె
కార్పణ్య దోషమ్ము కలత పరచె
ధర్మస మ్మూఢచి త్తంబుకలిగెనాకు
దిక్కెది నాకంచు దిగులు కలిగె
మంచెదొ చెడ్డదో మరిశిష్యునట్లుగా
వివరించి చెప్పు మా విశ్వవంద్య
అనుచునర్థించెగా నర్జునుండీరితీ
భగవంతు వేడెను బాధతోడ
ఆ.వె‌.కర్మ యోగమనగ కర్తవ్యపాలన
ఫలము పైని యాశ పడకు నీవు
నీదు ధర్మమెకటె నిజమైనమార్గమ్ము
అన్య ధర్మ మంత యఘము దెచ్చు
(రచన --విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత