బాలకృష్ణుడు

అమ్మమమతనంత యందుకొనగతాను
అవనిపై కృష్ణుడై యవతరించె
అఖిలాంత రాత్ముండునమ్మవడినిచేర
సుకృతంబిదియంచు సురులు తలువ
పూర్వభవమునందు పుణ్యాల పంటగా
చిన్నారి కృష్ణుండు చేత చిక్కె
ఇద్దరమ్మల కితడెపోయింపైన బిడ్డడు
అమ్మఘనత తెల్పె యవనిలోన
జగతికేగురువంచు జనులెల్ల పొగిడినా
అమ్మచాటుకొడుకె యవని పైన
జోలపాటలుపాడి జోకొట్ట నూకొట్టు
తనయుడేబోధించె  తత్త్వ మంత
ఆ‌వె.అమ్మ కన్న వేల్పు నవనిలో లేదోయి
మాతయన్న పేరె మంత్రమోయి 
తల్లి దండ్రి సేవ తపముకన్నను మిన్న
మనసు పెట్టి చూడ మహిమ తెలియు
(రచన:-- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత