కామితార్థ ప్రదాయినే
కామితార్థ మొసగు కళ్యాణ గాత్రుండు
ఆపద మొక్కుల నందు కొనగ
శేషాద్రి నిలయుడై శేషజనుల బ్రోవ
ధరణికేతెంచెగా తలచె తాను
వైకుంఠ వాసమ్ము వైముఖ్య మాయెగా
స్వామిపుష్కరిణికి స్వామి చేరె
ఆనంద నిలయాన నానంద మొందిరి
దేవతలెల్లరు తేజ మొప్ప
ఆ.వే. అమ్మ పాల వంటి నమృతరసమంతయు
నీదు చూపులోన నిరత ముండు
నీదుదర్శ నంబు నిముసమైననుచాలు
మాదు జన్మ మంత మధుర మగును
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
ఆనంద నిలయాన యధ్భుతంబౌరీతి
కోనేటి రాయుడు కొలువదీరె
కామితార్థముల నెల్ల కాదనడెప్పుడు
వడ్డికాసుల కోరు వడయుడతడు
ఆపదమొక్కులు నడగినంతనతీర్చి
ఆదుకొనునుగాదె నచ్యుతుండు
సగుణరూపంబవై సాక్షాత్కరించును
భక్తాళికెప్పుడు భద్రమిడగ
నిరతంబు సేవించు నిక్కమౌ భక్తాళి
కాచిరక్షించునుకరుణచూపి
ఆ.వె.శ్రీనివాసుడతడు శ్రేయస్సుకూర్చుగా
అమ్మమనసులాంటియచ్యుతుండు
అమ్మమనకుకాదెయలమేలుమంగమ్మ
ఇంతకన్నమనకుయెవరుదిక్కు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి