ఏకదంతుడు
సుముఖుడితడుభక్తసులభుడితడయ్య
ఏకదంతుడితడు యెఱుక నొసగ
కపిలవర్ణుడితడు కలుములొసగునింక
గజకర్ణుడితడోయి కరుణుకురియజేయు
లంబోదరుడితడు లాలిత్య హృదయుండు
వికటరూపమునుండు విశ్వ మయుడు
విఘ్నాధి పతితానె విఘ్నముల్ తొలగించు
దుష్టజనులకెల్ల ధూమకేతువనుచు
పేరుపొందెనితడు ప్రేమ మీర
సురగణా ధ్యక్షుండు సూర్పకర్ణుడితడు
ఫాలఛంద్ర ధరుడు భక్తవరదుడితడు
హీనగతిని మాన్ప హేరంబుడేగతి
భక్తజనులకెల్ల భద్ర మొసగు
స్కాందాగ్రజుండు సతతంబు రక్షించు
మాకేమి లోటయ్య మహిని సుమ్ము
ఆ.వే. అనుచు నిన్ను కొలుతనవరతము
కావు మయ్య మమ్ము కనిక రాన
ఆది దేవు డనుచు నార్థితో.పిలుతము
భుక్థి తోడ మాకు ముక్తి నిమ్ము
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి