దేవాదాయధర్మము

ఆచంద్రతారార్కమనునట్టి ధార్మికబుధ్ధితో
నిధులనిచ్థినయట్టినిపుణమతులు
రాజాదిరాజులు రత్నాలుసొమ్ములు
మాన్యంబులిచ్చారు మహితభక్తి
ఆలయాలనిధులునాలాయంబులకౌను
అన్యకార్యకలనయసలువలదు
దైవానికిచ్చిన ద్రవ్యంబు దిగమ్రింగ
శ్వానంపు జన్మము శాశ్వతము
సర్వసాక్షియుతడు సర్వంబు వీక్షించు
సమవర్తిచెంతకు సాగనంపు
కాలంబుకర్మంబుకలసివచ్చినవెన్క
ఎవరిగతియేరీతి యెవరికెరక
ఆ.వె‌. దేవ ద్రవ్యమంత దేవాలయంబుకే
ఖర్చుచేయవలయు ఖచ్చితంగ
వేరువాటెకేలవినియోగపరచిన
పాపఫలమునీకు ప్రాప్తమగును
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)
(

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత