నందివాహనుండు

ఆ "నంది" నెక్కిరానందముతోనంత
వచ్చినారుకదలి వచ్చినారు
కైలాసగిరినుంచి కదలివచ్చిరనుచు
తలచినారు సురులు తలచిమురిసినారు
శైలేంద్ర తనయశ్రీ శైలేంద్ర విభడంత
విశ్వంబుకావగా విచ్చేసె నిచ్చట
నటరాజ మూర్తియై నర్తించే తానంత
ఆనందమూర్తియైయషుతోషుడైతాను
విహరించు నర్తించు విశ్వమయత
రజితపర్వతమున రంజిల్లుశివుడంత
భాషికమ్మునుదాల్చె భవ్యరీతి
సప్తమాతృకాది సకలదేవతలెల్ల
కొలిచిమురిసినారు గొప్పభక్తి
(రచన:- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత