వరలక్ష్మైనమః

కరుణాంత రంగయౌ కనకమహాలక్ష్మి
సర్వభూత ముల కెల్ల తల్లి కాదె
ప్రకృతివికృతు లెల్ల పద్మాల యవియంచు
పరమార్థ విదులెల్ల పల్కినారు
చైతన్య స్తన్యంబు సర్వజీవులకిచ్చి
కన్నతల్లివలెను కాచినావు
అఖిలాంరాత్ముని యర్ధాంగి వీవమ్మ
కమలాలయైనీవు కరుణజూపు
మాత యనుచు పిలువ మమతాను బంధమ్ము
వేగ చూపగలవు వేడగానె
భక్తి కోటికీవె భద్రమ్ము చూపగా
తరలి రాగ దమ్మ తప్ప కుండ
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత