కృష్ణరాయల వర్షం రుతువర్ణన

సాహితీ సమరాంగణ సార్వభౌముడు రచించిన ఆముక్త మాల్యదా ప్రబంధము వర్ణణలకు పెట్టింది పేరు.అందులో వర్షర్తువర్ణన ఆసాంతం అనిర్వచనీయమైన అనుభూతిని మిగిలిస్తుంది.కొన్ని వర్ణనలు స్వభావోక్తులతో ఉత్ప్రేక్షలతో , అర్థాంతరన్యాసాలతో ఆనందాన్ని శ్రోతలకు పాఠకులకు మిగిలిస్తుంది.
రాయల లోకజ్ఞతకు కొన్ని పద్యాలు పట్టం కడితే ,కొన్ని పద్యాలు జ్యోతిశాస్త్ర మంత్రశాస్త్ర రహస్యాలను  విప్పిచెపుతాయి.
అందులో మచ్చుకు రెండు పద్యాలను అందులో దాగున్న ఉత్ప్రేక్షాలంకారలను  ఆస్వాదిద్దాము.
సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే వర్షాకాలం ప్రారంభమౌతుంది.ఇది అందరికుతెలిసిందే.దీనీనీ ఆధారంగా చేసుకొని రాయలు చేసిన వర్ణన మనలను ముగ్ధులనుచేస్తుంది.
వరుణుని వాహనం మొసలి.
వరణుడు మకరాన్ని వాహనంగా చేసుకొన్నాడని  అసూయచేకాబోలు సూర్యుడు కర్కాటకాన్ని వాహనంగా చేసుకొన్నాడని ఊహించారు.
సూర్యుని వేడిమిని భరించలేక సూర్యుని "కర్కశుడంటకోర్వక", వరుణుని వలె నీటిని గ్రహించాడట. వర్షకాలములో జలరూపంగా(అప్ =నీటిని) సముద్రనకు  అప్పుయిచ్చాడట ,అందుకే వేసవికాలంలో వడ్డీవ్యాపారిలా  కర్కశంగా వసులు చేస్తున్నాడని జనులునిందిస్తున్నారు.
ఇక్కడ కృష్ణరాయలు  అప్పు శబ్దమును నీటికి  ఋణమునకు శ్లేషను కూర్చాడు."అపోవా యిదగం సర్వం" కదా!
ఇక  శ్రీకృష్ణదేవరాయలు  జ్యోతిశ్శాస్త్రములో అందెవేసినచేయి. అందుకు ఈ పద్యం ఉదాహరణంగా చెప్పవచ్చు.
"వనతతి వరాహ వాహారి వాయుభుగ్వి
రోధి వారణ వర్షాభూలాది దొరగె
నెండ్రిరవిజేరె మూడవయేదల
తరణిధరణి ప్రమోద సంధాయికాడె"
" షట్రిదశ్తోభానుః" అనిజ్యోతిశ్శాస్త్రనియమము. జన్మరాశికి మూడింటా,ఆరింటా, పదింటనున్న సూర్యుడు శుభఫలములను యిస్తాడని జ్యోతిశ్శాస్త్రం నొక్కివక్కాణించింది.
అందుకే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించడంవల్ల "వోవావీవో రోహిణి అనే నామనక్షత్రం  "అయినది.
ఇక  దీని స్వారస్యం తెలుసుకొని ఆశ్చర్యం పొందుదాము
వనతతి= అడవుల సమూహం
వరాహం=అడవి పంది
వాహారి= దున్నలు
వాయుభుగ్విరోధి= వాయువును ఆహారంగా జీవించే పాములకు శత్రువు నెమలి
వారణములు = ఏనుగులు
వర్షాభులు = కప్పలు
పై వన్ని పేర్లు "వ"కారంతోనే కదా  ప్రారంభమయ్యాయి.
సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల వానలు కురిశి ఆనందించాయి.ఇవన్ని ఆనందించడం వల్ల నేలతల్లి ఆనందించింది.
వీటికి తరణీ (సూర్యుడు) ప్రమోదాన్ని కలిగించడానికి కారణమయ్యాడు.
అందుకే తరణి ధరణి ప్రమోద సంధాయికాడె"అంటు రాయలు శబ్దాలంకార సహితంగా ముక్తాయించాడు.
ఇక సముద్రం అత్తిల్లు ఆకాశం (సూర్యుడు) పుట్టిల్లు ఎలాగో చూద్దాము.

"వనధిగమనజ గర్భార్క జనితఘృణులు
మరిప్రసూతికి నతనిధామంబుజేరె
ఘనత జొచ్చిన యిండ్లను తనయలుండె
కాన్పునకు పుట్టినిల్లుజేరు క్రమము గనమె"
 సూర్యుని కిరణాలు సముద్రమునందలి నీటిని ఆవిరి రూపమున నీటిని గ్రహించి  మేఘాలై వర్షాలను కురిపించడం  అందరికి తెలిసిన పర్యావరణ ప్రక్రియ.
దీనిని రాయలు కాన్పుసమయాన  గర్భిణులైన ఆడపిల్లలు  అత్తారింటినుంచి పుట్టినింటికి వెళ్ళడం అనే అంందమైన తెలిగింటి ఆచారంతో  పోల్చడం హృదయానికి హత్తుకొనే మధురానుభూతి.
సూర్యకిరణములే మేఘములని ప్రసిధ్ధి. ఆసూర్యుని వల్లకలిగిన(పుత్రికలు) మేఘములు సముద్రుడనే భర్తవల్ల  జలమనే గర్భాన్ని  దాల్చి  ప్రసావానికై  సూర్యుని,(పుట్టిల్లు)  చేరుతున్నట్లు ఉత్ప్రేక్షించడం జరిగింది.
ప్రఖ్యాతి గాంచిన అత్త వారింట కాపురం చేయుచున్న  ఆడబిడ్డలు గర్భం దాల్చిన వెంటనే  పుట్టినింటికి చేరడం అందమైన భావము.
ఇలా రాయడం కృష్ణరాయలకే చెల్లింది.
 చెప్పడం మరిచాను కృష్ణదేవరాయల పద్య రచనా  శైలి  సాధారణంగా నారికేళ పాకంలా అనిపించవచ్చు. ఎంతైన అతడు సామ్రాట్టుకదా! 
తరువాత రాయల స్వభోక్తిశైలిని  ఆస్వాదిద్దాము.
ప్రస్తుతానికి సెలవు

(రచన: విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)సాహితీ సమరాంగణ సార్వభౌముడు రచించిన ఆముక్త మాల్యదా ప్రబంధము వర్ణణలకు పెట్టింది పేరు.అందులో వర్షర్తువర్ణన ఆసాంతం అనిర్వచనీయమైన అనుభూతిని మిగిలిస్తుంది.కొన్ని వర్ణనలు స్వభావోక్తులతో ఉత్ప్రేక్షలతో , అర్థాంతరన్యాసాలతో ఆనందాన్ని శ్రోతలకు పాఠకులకు మిగిలిస్తుంది.
రాయల లోకజ్ఞతకు కొన్ని పద్యాలు పట్టం కడితే ,కొన్ని పద్యాలు జ్యోతిశాస్త్ర మంత్రశాస్త్ర రహస్యాలను  విప్పిచెపుతాయి.
అందులో మచ్చుకు రెండు పద్యాలను అందులో దాగున్న ఉత్ప్రేక్షాలంకారలను  ఆస్వాదిద్దాము.
సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే వర్షాకాలం ప్రారంభమౌతుంది.ఇది అందరికుతెలిసిందే.దీనీనీ ఆధారంగా చేసుకొని రాయలు చేసిన వర్ణన మనలను ముగ్ధులనుచేస్తుంది.
వరుణుని వాహనం మొసలి.
వరణుడు మకరాన్ని వాహనంగా చేసుకొన్నాడని  అసూయచేకాబోలు సూర్యుడు కర్కాటకాన్ని వాహనంగా చేసుకొన్నాడని ఊహించారు.
సూర్యుని వేడిమిని భరించలేక సూర్యుని "కర్కశుడంటకోర్వక", వరుణుని వలె నీటిని గ్రహించాడట. వర్షకాలములో జలరూపంగా(అప్ =నీటిని) సముద్రనకు  అప్పుయిచ్చాడట ,అందుకే వేసవికాలంలో వడ్డీవ్యాపారిలా  కర్కశంగా వసులు చేస్తున్నాడని జనులునిందిస్తున్నారు.
ఇక్కడ కృష్ణరాయలు  అప్పు శబ్దమును నీటికి  ఋణమునకు శ్లేషను కూర్చాడు."అపోవా యిదగం సర్వం" కదా!
ఇక  శ్రీకృష్ణదేవరాయలు  జ్యోతిశ్శాస్త్రములో అందెవేసినచేయి. అందుకు ఈ పద్యం ఉదాహరణంగా చెప్పవచ్చు.
"వనతతి వరాహ వాహారి వాయుభుగ్వి
రోధి వారణ వర్షాభూలాది దొరగె
నెండ్రిరవిజేరె మూడవయేదల
తరణిధరణి ప్రమోద సంధాయికాడె"
" షట్రిదశ్తోభానుః" అనిజ్యోతిశ్శాస్త్రనియమము. జన్మరాశికి మూడింటా,ఆరింటా, పదింటనున్న సూర్యుడు శుభఫలములను యిస్తాడని జ్యోతిశ్శాస్త్రం నొక్కివక్కాణించింది.
అందుకే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించడంవల్ల "వోవావీవో రోహిణి అనే నామనక్షత్రం  "అయినది.
ఇక  దీని స్వారస్యం తెలుసుకొని ఆశ్చర్యం పొందుదాము
వనతతి= అడవుల సమూహం
వరాహం=అడవి పంది
వాహారి= దున్నలు
వాయుభుగ్విరోధి= వాయువును ఆహారంగా జీవించే పాములకు శత్రువు నెమలి
వారణములు = ఏనుగులు
వర్షాభులు = కప్పలు
పై వన్ని పేర్లు "వ"కారంతోనే కదా  ప్రారంభమయ్యాయి.
సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల వానలు కురిశి ఆనందించాయి.ఇవన్ని ఆనందించడం వల్ల నేలతల్లి ఆనందించింది.
వీటికి తరణీ (సూర్యుడు) ప్రమోదాన్ని కలిగించడానికి కారణమయ్యాడు.
అందుకే తరణి ధరణి ప్రమోద సంధాయికాడె"అంటు రాయలు శబ్దాలంకార సహితంగా ముక్తాయించాడు.
ఇక సముద్రం అత్తిల్లు ఆకాశం (సూర్యుడు) పుట్టిల్లు ఎలాగో చూద్దాము.

"వనధిగమనజ గర్భార్క జనితఘృణులు
మరిప్రసూతికి నతనిధామంబుజేరె
ఘనత జొచ్చిన యిండ్లను తనయలుండె
కాన్పునకు పుట్టినిల్లుజేరు క్రమము గనమె"
 సూర్యుని కిరణాలు సముద్రమునందలి నీటిని ఆవిరి రూపమున నీటిని గ్రహించి  మేఘాలై వర్షాలను కురిపించడం  అందరికి తెలిసిన పర్యావరణ ప్రక్రియ.
దీనిని రాయలు కాన్పుసమయాన  గర్భిణులైన ఆడపిల్లలు  అత్తారింటినుంచి పుట్టినింటికి వెళ్ళడం అనే అంందమైన తెలిగింటి ఆచారంతో  పోల్చడం హృదయానికి హత్తుకొనే మధురానుభూతి.
సూర్యకిరణములే మేఘములని ప్రసిధ్ధి. ఆసూర్యుని వల్లకలిగిన(పుత్రికలు) మేఘములు సముద్రుడనే భర్తవల్ల  జలమనే గర్భాన్ని  దాల్చి  ప్రసావానికై  సూర్యుని,(పుట్టిల్లు)  చేరుతున్నట్లు ఉత్ప్రేక్షించడం జరిగింది.
ప్రఖ్యాతి గాంచిన అత్త వారింట కాపురం చేయుచున్న  ఆడబిడ్డలు గర్భం దాల్చిన వెంటనే  పుట్టినింటికి చేరడం అందమైన భావము.
ఇలా రాయడం కృష్ణరాయలకే చెల్లింది.
 చెప్పడం మరిచాను కృష్ణదేవరాయల పద్య రచనా  శైలి  సాధారణంగా నారికేళ పాకంలా అనిపించవచ్చు. ఎంతైన అతడు సామ్రాట్టుకదా! 
తరువాత రాయల స్వభోక్తిశైలిని  ఆస్వాదిద్దాము.
ప్రస్తుతానికి సెలవు

(రచన: విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత