గోవర్ధనోధ్ధారణము

గికురించుదనుజులకీటాణువులరీతి
నలిపేయువాడోయినల్లనయ్య
మంధరగిరినంతభారమేలేనట్లు
కూర్మమైమోసేవు కూర్మిమీర
గోవర్ధనాన్నంత కొనగోటితోమోసి
గోవిందుడైనావుకూర్మిమీర
దేవేంద్రుగర్వంబుఖర్వంబుచేసిన
మహనీయమూర్తియేమాధవుండు
కాళియుశిక్షించి కరుణించి కాపాడు
విఖ్యాత నటుడైన విష్ణువితడు
ముగ్ధభక్తికతడుమురిసిముగ్ధుడై
ఆలమందతోడయరుగుచుండు
నందగోకులాననవనీతచోరుండు
మదిని నిండవలయుమనకునెపుడు
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత