తరువు చెప్పుతగవు

గగనంబు తాకగా గట్టిగా కోరెటి
భూజంపు వేర్లను భూమిలోన
లోతుగా వ్యాపించు యత్నంబుచేయను 
ఎత్తుగా యేదిగేటియత్నంబులోతాను
లోతుగాలోలోన లోనికెళ్ళు
పాదపమీరీతి బ్రతుకుపాఠంబును
నేర్పుగా నీరితి నేర్పెమనకు
విజయంబునందగా వినయంబువలయును
నేలవిడిచి సాము నీకుదగదు
మూలంబుమరవకు మూర్ఖంబతోనీవు
ప్రగతిపథమునందు పయనమైన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత