సజ్జన సాంగత్యము

సాధుభావమున్న సజ్జనగోష్టిని
మంచిబుధ్ధితోడిమంచినడత
సద్విచారసహిత సంతోషమెప్పుడు
కలుగనీయవయ్య కంబుకంఠ

*శ్లోకం*

సాధుసజ్జనసాంగత్యం
సద్బుద్ధిమ్ సత్ప్రవర్తనం|
సంతోషం సద్విచారాంశ్ఛ
దేహి మే మధుసూదన||

(సుభాషితరత్నావళిః)

*తాత్పర్యం*

ఓ మధుసూదనా! నాకు సాధుస్వభావముండేవారితోను, మంచి ప్రవర్తన గలవారితోను సాంగత్యమును కలుగజేయుము. నిరతము సంతోషముతో మంచి ప్రవర్తనతో ఉండునట్లు చేయు. మంచి బుద్ధిని మంచి ఆలోచనలను నాకు ప్రసాదించుము.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత