పంచపాండవులు

॥శ్లోకం॥
ధర్మో వివర్ధతి యుధిష్టిర కీర్తనేన
పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన
(అన్న శ్లోకాన్ని అనుసరించి యథచితంగా నాభావాను వాదము)

పెనుపొందుధర్మమ్ము పెద్దన్న ధర్మజు
నాముబు స్మరియింపధరణిలోన
భీమన్న నామాన్ని ప్రేమతో స్మరియింప
పాపలు మొత్తము పారిపోవు
విజయుని నామాన్ని వినుతించువారికి
పగరపై విజయమ్ము ప్రతిపలించు
మాద్రిసుతులపేరు మదిలోన తలచిన
రోగాలురొష్టులు రూపుమాయి
పంచమవేదమ్ము భారతంబన్నది
విఖ్యాతమైనట్టి విషయమోయి
బాదరాయణుండు భారతంబంతయు
మనుజజాతికిచ్చె మమతతోడ
పుణ్యగాధలెల్లపురుషార్థ ధర్మాల
ఆచరించవలయు నార్యులార!
(రచన:--విద్వాన్ గొల్లా పిన్ని  నాగరాజు శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత