భజగోవింద శ్లోకానువాదము
1భార్యపుత్రులనెడిభావమ్ము చూడగా
చిత్రమగునె కాదె సృష్టిలోన
ఎవరు తానొతనకెయెరుక లేదు
తత్త్వ మెరుగ తరమె తనకు నింక
2బాల్యమేమొ యాటపాటలకరుగును
యువతి వలపు చిక్కె యవ్వనమ్ము
ముదిమి వయసులోన ముసురుకొనునుచింత
బ్రహ్మ ముందు మనసు పారదకట!
(ముక్తికోరనట్టి మూర్ఖ బుధ్ధి)
3 ప్రాణమున్న వరకె భార్యాను బంధమ్ము
కుశలమడుగు తాను కూర్మి మీర
ఊపిరాగగానె యుండదు బంధమ్ము
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి