ఎండమావి బ్రతుకు

ఎండమావి వోలె యీకన్నపట్టుజగతి
లిప్త లోనె తానులీనమగును
భ్రమలముణగకుండ భధ్రమౌరీతిగ
సుజనసంగమందు సుఖముగనుము

*శ్లోకం*

జగన్మృగ తృష్ణ తుల్యం
వీక్ష్యేదం క్షణభంగురం|
సుజనై: సంగతి౦ కుర్యాత్
 ధర్మాయచ సుఖాయచ||

(సుభాషితరత్నావళిః)

*తాత్పర్యం*

 ఈలోకము ఎండమావి వంటిది . క్షణభంగురమైన దీనిని గాంచి భ్రమ చెందక
సుఖము కొరకు సత్పురుషుల సహవాసము చేయ వలయును.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత