విశ్వ శునక దినోత్సవం
కుక్కకింతరొట్టెకూర్మితో పెట్టిన
తోడునీకుయనుచు తోకనూపు
మాయమర్మమసలుమచ్చుకైననులేని
గ్రామసింహమొక్క ఘనత యిదియె
ఆదిపర్వమందునగుపించిననీవంత
జనమెజయునికేమొశాపమొసగి
ధర్మరాజువెంటధాటిగావెళ్ళెసి
ధర్మబుధ్ధిచాటుధరణికంత
శిక్షనొసగినేని చీకాకు పెట్టక
జాగిలాంబుసుంతజాగులేక
నేరగాళ్ళుపట్టునైపుణ్యమంతయు
శ్వాసలోన నుండు చక్కగా ను
కాలభైరవున్ని కనిపెట్టుకొని యుండు
స్వామిభక్తికిదియొ సాక్ష్యమోయి
దత్తగురునిచేరి ధన్యత పొందిన
సారమేయజన్మ సార్థకమ్ము
[ ఈరోజు విశ్వ స్వాన దినోత్సవ సందర్భంగా, అమాయకపు ప్రాణులకు అంకితము గా చిన్ని కవిత]
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి