వరలక్ష్మి
వరలక్ష్మి మాయింట వరమీయ వచ్చెను
తనకెంత పనియున్న తప్పదెపుడు
ఆహ్వాన మందగా యశ్వరథముపైన
అప్పుడెతానంత యరుగుదెంచు
క్షీరాబ్ది పుత్రిక స్థిరముగా కుర్చుండ
ఆసనంబాయెగా నబ్జమంత
పాద్యంబు నర్పింతు పారవశ్యపుభక్తి
అర్ఘ్యము నర్పింతు నమిత భక్తి
ఆ.వె.ఆది లక్ష్మివమ్మ యాచమించవలయు
మజ్జనంబు సేయ మమ్మయింక
పాలుపెరుగు మధువు పంచామృతము లెల్ల
సిద్ధ పరచినాము స్వీకరించి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి