సుభాషితము
చిత్తమును సరించి చిందునుపలుకంత
పలుకననసరించె పనికిపూను
మనసువాక్కుపనులుమహనీయమౌయుండు
మిన్నువిరిగెనేని మీరరెపుడు
*శ్లోకం*
*యథా చిత్తం తథా వాచో*
*యథా వాచస్తథా క్రియాః।*
*చిత్తే వాచి క్రియాయాం చ*
*సాధూనామేకరూపతా॥*
(సుభాషితరత్నావళిః)
*తాత్పర్యం*
మంచి వారికి వారి ఆలోచనలు ఏ విధముగా ఉంటాయో వారు మాట్లాడే తీరు, మాటలు కూడా అదే విధంగా ఉంటాయి. వారి మాటలు ఏ విధంగా ఉంటాయో వారి చేతలు, కర్మలు కూడా అదే విధంగా ఉంటాయి. అటువంటి వారే సాధువులు. అటువంటి సాధువులకి వారి ఆలోచనలందు, వారు చెప్పే విషయములందు మరియు వారి చేతల యందు ఒకే విధము ప్రస్ఫుటమౌతుంది. అనగా వారి భావాలకి, వారి ప్రవచనాలకి మరియు వారి కర్మలకి మధ్య సయోధ్య, సారూప్యత ఉంటుంది. అనగా వారు త్రికరణ శుద్ధులై ఉంటారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి