హరిహారాద్వైత సిధ్ధి

"రా"జీవనేత్రుడే "మా"జీవమంత్రమ్ము
రామతారకమౌను రామ రక్ష
పరమేశు తత్త్వంబు పరమాత్ము విభవమ్ము
వాగర్థములరీతి వాస్త వమ్ము
మాహేశు నామంబు మాధవు రూపంబు
మదిలోని మెరువగా మంగళమ్ము
భుజగశయనుకొల్చి భుజగభూషణు మ్రొక్కి
అతిశయానందమ్ము నందుకొందు
ఆ.వె.ఎన్నిజన్మ లేగె యీజన్మలభియించె
ఆదుకొందువనుచు నాశకలదు
దారిచూపు వాడు దామోదరుండంచు
మదిని నమ్మినాను మరువకెపుడు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
హరహరాద్వైతమే యంతిమ సత్యంబు
ఇంతికన్ననిజము యిలను లేదు
వాసుదేవుమయుడు వామదేవుడెపుడు
తిక్కన్న కొలిచిన తీరుయిదియె
ఫణిరాజు పక్కగా పవళించు విష్ణుండు
సర్పంబు హారమ్ము శంకరునకు
నీలమేఘుడతడు నీలకంఠుడితడు
హరిమయత్వంబనహరుడువెలయు
హరిగుణమణిమయ సరములు గళమున
భక్తుల మదినిండ భవుడు మెచ్చు
ఆ.వె.శివుని హృదయమెల్ల శ్రీనివాసమగును
శ్రీనివాసుమదియె శివుని నెలవు
వేరుచేయ దగునెవీరినెపుడుకూడ
భేదభావ మెపుడు భీతిగొల్పు
(రచన:-- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత