గురు దక్షిణ

ఒక్కయక్షరంబునాచార్యనొద్దను
అభ్యసించువాడవనిలోని
ధనముగుర్వుకిడినదక్షిణానొసగిన
అప్పుతీరునెట్లు నదియెనిజము

*శ్లోకం*

*ఏకమేవాక్షరం యస్తు*
*గురుశ్శిష్యం ప్రబోధయేత్ |*
*పృథివ్యాం నాస్తి తద్రవ్యం* *యద్దత్వా చా ఽనృణీ భవేత్ ॥*

*తాత్పర్యం*

గురువుగారి వద్దనుండి ఒక్క అక్షరమంత జ్ఞానం పొందినా ఆ ఋణము నుండి విముక్తిని పొందడానికి గురుదక్షిణగా ఇవ్వగలిగిన ద్రవ్యము ఈ ధరణిలో లేదు.

*వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత