శిక్షావల్లి

తల్లియే దైవంబు ధరణిజనులకెల్ల
తండ్రి యే దేవుండు తనయులార!
గురువు దైవమనుచు గుర్తించి మసలిని
ఇహముపరములెల్ల యింకనీవె
అతిథి పూజనమంత యచ్యుతార్చనయగు
అనుశాసనంబిది యాచరింప
సత్యంబు పలుకుటె సాగించ వలెనీవు
ధర్మమార్గమెపుడు తప్ప రాదు
చదువుసంధ్యలయందు తాత్సారభావమ్ము
కలనైన నీకింక కలగరాదు
ఆ.వె స్నాత కోత్స వమున సాయించె గురువిట్లు
అనుసరింప వలయు నాస్తతోన
వేద విదుల వాక్కు విధ్యక్త మార్గమ్ము
ఆచరింప వలయు నందరింక
(రచన:--, విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత