మిత్రత్వం
గిరౌ మయూరా గగనే పయోదా
లక్షన్తరేర్కశ్చ జలేషు పద్మమ్
ఇందుర్ది లక్షం కుముదస్య బంధుర్యోయస్య
మిత్రం నహితస్య దూరం.
కొండయందు నెమళ్ళు, ఆకాశం మేఘమునకు స్నేహితులు. లక్ష యోజనములు గల సూర్యుడు జలమున గల పద్మమునకు మిత్రుడు. రెండు లక్షల యోజముల దూరమున గల చంద్రుడు కలువలకు బంధువు. స్నేహితులకు దూరమేక్కడిది?
భావము:---
అద్రిపైన నెమలియంబరానమెయిలు
ప్రాణసఖులరీతి పరవశమ్ము
గగనాన భానుండు కాసారమందున
సరసిజంబంతట సఖులుకారె
కువలయంబుననుండు కుమదమ్మువికసించు
చంద్రునికాంచగా చనువుమీర
దూరభారమనుచు దూరంబు పెట్టరు
ప్రాణమిత్రులెపుడు బాధ్యతెరిగి
హితులుకారె సన్నిహితులెప్పుడైనను
కష్టసుఖము లందు కలసిమెలసి
( ఆనువాదం:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి