కలియుగ వైకుంఠం తిరుమల

కలియుగ దైవంబు గరుడాద్రి నిలయుండు
ఆనంద నిలయుండు నమృత మూర్తి
భువనైక పూజ్యుండు మునిబృంద వంద్యుండు
వృషభాధ్రి నాథుడై వరము లొసగు
శేషాద్రి నిలయుండు శేముషీ విభవుండు
శేషజనులకెల్ల  క్షేమ మొసగు
వైఖంఠ వాసంబు వైముఖ్య మాయెనో
కోనేటి పజ్జను కోరినాడు
ఆ.వే. భక్త జనులకెల్ల భవబంధమూల్ దీర్చు
భక్త తతికి కొంగు పసిడి యతడు
అమ్మ పాల వంటి నానంద మందివ్వ 
కదలి వచ్చినాడు కన్న తండ్రి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత