వినాయకుడు
నీలాల నింగియే నిండైన గొడుగాయె
అవనీతలంబతయాసనమ్ము
మండుటెండలునీకుమలయమారుతమెట్లు
జడివానయంతయు జలకమాయె
దుర్వాంకురములెల్ల దుప్పటట్లు
పక్కగా నీకిట్లు పరిచినారేమోను
అఖువాహనుండిట్లునారుబయట
ఎట్లుండునోయంచుయెలుక తలచె
మోదకహస్తాన మోదకమ్ములిడగ
భక్తసంఘంబంత వత్తురేమొ
సిధ్ధిగలుగునట్లుబుధ్ధినొసగమయ్య
నిన్నునమ్మినాము నీవెదిక్కు
కామితంబులొసగి కనిపెట్టి కాపాడు
వినుజేతుమయ్య విఘ్నరాజ!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి