భయపెట్టుతల్లికే భయము

భయపెట్టుతల్లియె భయముతో పతిచేర
భయభంగవ్యసనుండుభయముబాపె
దశకంఠుగర్వాన్ని దర్పంబునడచగా
సమకట్టెతానిట్లు సాంబశివుడు
నటనంబునర్తించునటరాజునటనాన
జగదంబతానంతజట్టుగూడె
కైలాసశైలంబుకదలించజూడగా
పాదాంగుళీయంబు పనికివచ్చె
వాగర్థములరీతి వాత్సల్యభావము
మనపైన చూపిన మనకుచాలు
పార్వతమ్మ తల్లిపంచనుజేరిన
మనకుకొదవయేమి మహినిసుమ్ము
అండదండలిచ్చునభవుడెపుడుతండ్రి
పుట్టినిల్లుకాదె భువిని మంత
(రచన- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత