తాచేడ్డనరుడు

తాచెడ్డనరుడంత తలతిక్క పనిచేసి
మర్కటమాతనుమాయజేసి
చరవాణిచూపించిచాకచక్యంబుగా
చెడగొట్టెకోతుల చేతులార
ఏమున్నదోయేమొ యేకాగ్రబుధ్ధితో
కపితల్లికూనతోకాంచనిట్లు
తాచెడ్డకోతంత తాచెడగొట్టుదె
వనమంతనానుడి వాస్తవాన్ని
మనుజాతికురీతిమార్చవలయునింక
కాలమహిమకాదె కపులబుధ్ధి
మనుజజాతికిట్లుమార్చినాడేమొను
నాల్గమోములున్న నలువయిట్లు
ఏమికారణంబొయింకేమిచేయునో
కాని కాలంలొ చింతచెట్టు నిప్పులు
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత