సితకంఠుడు- నీలకంఠుడు

శివుడు నీలకంఠుడు కదా! కంఠాన నలుపేదంచు ప్రశ్శించారు.అందుకు నమక పాఠంలో నల్లమఛ్ఛలేని వాడనీ వుంది.అంటె గరళం మ్రింకముందు 

కంఠాన నలుపేల కనిపించ లేదంటు
ప్రశ్నించ వద్దండీ పరమశివుని
అరమోడ్పు కనులతో నానంద మూర్తియై
జగతితొ తానంత జాలమాడు
మారేడు తలనుండ మారేడు మావాడు
మాకిచ్చు సిరులెల్ల మరువకుండ
పాములే దండలై పరమేశు మెడలోని
అందాలు చిందించె  నధ్బుతమ్ము
నంది వాహనుండు నయనోత్సవంబుగ
ధర్మ కర్మలెల్ల ధరణి నిల్పి
వారణాసి కొచ్చె వసుధపుణ్యంబు పండగ
దండి మిడగ రండి తత్త్వ మయుని
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత