సూర్యుడే -స్నేహితుడు

సూర్యుకన్నమనకుసుస్పేహితుడెవరు
మంచిమిత్రుడతడుమనలగాచు
అతడులేనిమనకుయస్తిత్వమేదయ్య
సకలసృష్టినొసగు స్రష్టయతడు
అన్నపానములెల్లయాప్తుడై మనకిచ్చు
ఆరోగ్యభాగ్యంబునతనికృపయె
పాడిపంటలనిచ్చుభాస్కరుండెపుడు
అన్నదాతయగునుయవినిలోన
వెలుగుజిలుగులతోవేయ్యేళ్ళువర్ధిల్ల
ఆశిస్సులొసగేటియర్కుడతడు
తమమునంతయబాపి తాపంబుతీర్చును
వందనములుసేయవరములొసగు
హితడుమనకు సన్నిహితుడెప్పుడైనను
అర్కపత్రపూజయభిలషించు
వేయిసేతులున్న వేల్పుదేవరకన్న
నేస్తమెవరుమనుకునిలనుయెపుడు
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత