భజగోవిందం

ఊపిరున్నవరకు వూసులాడగలరు
బంధుమిత్రులెల్ల  బాగుగాను
ప్రాణవాయువాగ భార్యయైననుకూడ
భయముచెందునకట! భర్తయనక

 💎శ్రీశ్రీశ్రీ శఙ్కరభగవత్పాద విరచిత భజగోవింద స్తోత్రం ఆరవ శ్లోకము.... 

యావత్పవనో నివసతి దేహే 
తావత్పృచ్ఛతి కుశలం గేహే|
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే||

*_-!!తాత్పర్యము!!-_*
శరీరములో ఊపిరి ఉన్నంతవరకు ఇంటిలోనివారు కుశలమును విచారింతురు....ఆ *ఊపిరి ఆగిపోయి, మరణము సంభవించినపుడు నీ మృతదేహము చూసి సమీపించుటకు నీ భార్య కూడా భయపడును*.... 🧘‍♂️🙏

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత