ఉద్యోగపర్వము
13-07-1982 లో నవభారత పాఠశాలో ఉపాధ్యాయ వృత్తిని జూనియర్ తెలుగు పండితునిగా ఆరంభించాను. ఆ అనుబంధం 33సంవత్సరాలు కొనసాగింది. ఆవిశేషాలు అందరికీ తెలిసినవే.ముఖ్యంగా పాల్వంచలో నవభారత ప్రవేశానికి చేయూతనిచ్చిన వారిని స్మరించడం నా బాధ్యత, విధి,కర్తవ్యము,ధర్మము.ముఖ్యంగా శ్రీరామకృష్ణ మఠం అధ్యక్షులు (,అప్పుడు హైదరాబాద్ ) పూజ్యశ్రీశ్రీశ్రీ స్వామీ రంగనాథానందలు,స్వామీ శ్రరంగానంద,మరియు శ్రీ జితాత్మానందలకు మనః పూర్వక ప్రణామాలు. వారి ఆశిస్సులతోనే ఉపాధ్యాయునిగా నేను ఎన్నో విజయాలను సాధించాను .తరువాత నవభారత కర్మాగారం యాజమాన్యం వారికి నా హృధహదయపూర్వక కృతజ్ఞతలు.ముఖ్యంగా నేను మిక్కిలి అభిమానించే విశిష్ట వ్యక్తి, మేనేజింగ్ డైరెక్టర్ గారైన శ్రీ దేవినేని అశోక్ గారు. వారి ప్రథమ పరిచయం నేటికి మనసులోనే మెదులుతుంది. వారు నాపై చూపిన ఆప్యాయత ఇంతా అంతా అని మాటలతో వర్ణించడానికి మాటలు చాలవు.వారిని చూస్తే నాకు భోజరాజో , కృష్ణరాయల గుర్తుకు వస్తారు. "నిరాశ్రయో నశోభంతే పండితా వనితా లతా" అంటారు పెద్దలు.అంటే ఆశ్రయం లేకుండా పండితులు,వనితలు లతులు శోభించరు అని అర్థం. మాములుగా కర్మాగారాల్లో యాజమాన్యము శాస్త్రీయదృష్టిని సాంకేతికతను అభిలషించారు.కానీ నవభారతంలో సాహిత్యం పై మంచిగట్టు పట్టున్నవారు లభించడం బహు అరుదు.నన్ను ఇంటర్యూ చేసిన వారు శ్రీ నూతక్కి సుబ్బారావుగారు, శ్రీ RSV ప్రసాద్ గారు శ్రీ మహమ్మదాలిగారు ముఖ్యులు.ముఖ్యంగా కృష్ణరాయల ఆముక్తమాల్యద కర్తృత్వం సుదీర్ఘ చర్చ వారికి నాపై సదభిప్రాయం కలిగించింది. అంతేకాదు నా శ్రీమతి ఓపెన్ హార్ట్ ఆపరేషన్ సందర్భంలో మాన్యులు యం.డి.గారు నాకు మనో ధైర్యాన్ని కలిగించారు. ప్రతిసంవత్సరం పాఠశాల వార్షికోత్సవ సందర్భంలో వారి చేతిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోవడం మధురస్మృతి.
చాలా పర్యాయలు నవభారత్ క్వార్టర్స్ గురించి అడగాలని అందరూ అని వారు.కానీ సురేంద్రుని వద్దకు వెళ్ళి రెండు కేజీల వంకాయలు అడిగినట్లు ఉంటుందని మానేశాను.ఇంటర్యూ తరువాత క్యాంటిన్ లో భోజనం పెట్టి తిరుగు ప్రయాణం టికెట్టు డబ్బులిచ్చే సంప్రదాయం నవభారత లోనే చూచాను. కవిగా రచయితగా తీర్చిదిద్దిన నవభారత ఉన్నత పాఠశాల యాజమాన్యం నామాతృసంస్థ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి