గుణము ప్రదానము
పుట్టుకేమిగొప్ప పుణ్యంపుగుణమున్న
పూజనీయుడగును పుడమి లోన
అల్లెత్రాడులేనియత్యంతశ్రేష్టమౌ
ధనువునిష్టపడరుధరణీలోన
*శ్లోకం*
యస్య కస్య ప్రసూతోఽపి
గుణవాన్ పూజ్యతే నరః ।
ధనుర్వంశవిశుద్ధోఽపి
నిర్గుణః కిం కరిష్యతి ॥
(సుభాషితరత్నావళిః)
*తాత్పర్యం*
గొప్పవాడైన వానికి గాని లేక నీచుడైన వానికి గాని, ఇలా ఎవనికో ఒకనికి పుట్టిన మనుష్యుడైనను ,అతడు సద్గుణసమ్పన్నుడైనవాడు ఐతే మాత్రమే ఈ లోకులచే పూజింపబడుతాడు. ఎట్లనగా , శ్రేష్ఠమైన వెదురుచే నిర్మితమైనను, అల్లెత్రాడు లేనిదైనచో అట్టి బాణము వలన ఏమి ఉపయోగము. ఎవరు అలాంటి ధనుస్సును ఆదరిస్తారు ? అలా గుణరహితమైతే శ్రేష్ఠమైన కులమందు పుట్టినను, పూర్తిగా ప్రయోజనశూన్యమని భావము.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి