నిత్యసుఖకారాకాలు
ఆర్థంబురాకడయారోగ్యభాగ్యంబు
మనసెరిగిపలుకు భార్యయున్న
మాటవినెడిసుతుడు మంచిదౌవిద్యయు
నిత్యసౌఖ్యమొసగునీకుయెపుడు
*శ్లోకం*
అర్థాగమో నిత్యమరోగితా చ ప్రియా చ భార్యా ప్రియవాదినీ చ ।
వశ్యశ్చ పుత్రోఽర్థకరీ చ విద్యా షడ్ జీవలోకస్య సుఖాని రాజన్ ||
(సుభాషితరత్నావళి)
*తాత్పర్యం*
ఓ రాజా! నిరంతరం ధనం రావడం, రోగం లేకుండా ఉండడము, ఇష్టమయ్యేట్లుగా మాట్లాడునదైన మరియు ఇష్టమైనదైన భార్య, అనుకూలుడైన కుమారుడు, ధనాన్నిచ్చే చదువు, ఈ ఆరుకూడా ఈ ప్రపంచంలో సుఖకారకములు అని భావము.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి