భానూదయం
ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకీవంత
గగనాన నీవంత కానవచ్చి
మదిలోని భీతంత మాయమ్ము చేయగా
కనువిందు జేసేవు కాంక్ష తీర
జడివాన జడిపించి జడిపించి జారుతూ
కన్నీరు నింపుతూ కదిలిపోయె
ఊరంతా నీరాయె యునికికె కరువచ్చె
వరదంత బాధించె వగపుదెచ్చె
ఆ.వె.మిత్రుడొచ్చె మాకు మిడుకుటల్ పోగొట్టి
పేరు నిలుపు కొన్న పెద్ద మనసు
తండ్రికాన నట్టి తనయులు రీతిగా
బాధ పడితిమయ్య భాను కొరకు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి