భారతీయత
హృదయారవిందాన హృషికేశు నెప్పుడు
దర్శించు వారున్న ధరణిమాది
ఉదయించుభానుని నుప్పొంగు భక్తితో
దండంబు పెట్టెటి నడత మాది
జలరాశినంతయు జాహ్నవీ తోయంగ
పులకించి పలికేటి తలపు మాది
మా"రేడు"నీవంచు మారేడు పత్రితో
పరమేశు పూజించు భక్తిమాది
తరులలో గిరులలో తత్త్వైక దృష్టితో
భగవంతు దర్శించు భక్తిమాది
రామయ్యగుడిలేని గ్రామమే లేదాయె
హనుమన్న కున్నాయి యాలయాలు
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడే తండ్రి
అనుకొన్న భూమియె యమరె మాకు
ఆ.వె.వేదరుషులు కన్న వేద భూమియిదియె
జ్ఞాన నిధులు కన్న జన్మ భూమి
పూర్వ పుణ్య మబ్బ పుట్టంగ వచ్చును
భారతవర్ష మందు భాగ్యమున్న
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి