బాలగంగాధర తిలక్ పాఠ్యభాగము
బాల్యంలో ఉపవాచకం ద్వారా లోకమాన్యుని పరిచయం జరిగింది.తెలుగు ఉపాధ్యాయుడుగా వున్నప్పుడు 9వతరగతి తెలుగు పాఠంగా ముట్నూరి కృష్ణారావు గారి "లోకమాన్యుడు"(సంపాదకీయం వ్యాసం) పాఠంగా చెప్పె అదృష్టం కలిగింది.
లోక మాన్యుడు స్వాతంత్ర్యం గురించి చెబుతూ" ఆత్మవశం సూఖం-పరవశం దుఃఖం "అని నిర్వచించిన విధానం గొప్పది. ఎవరో విలేఖరి స్వాంత్రత్యసిధ్ధి తరువాత మీరు ఏ పాత్ర నిర్వహిస్తారని అడుగగా, భారత దేశం ప్రస్తుతం అస్వాభివిక స్థితిలో వుంది. కావున రాజకీయక్షేత్రంలో పనిచేయవలసి వచ్చింది. స్వాతంత్ర్యం సాధించి తరువాత నేను ఏ కళాశాలలో నో విద్యాలయంలో ను గణితశాస్త్ర బోధకుడు గా వుంటానని చెప్పాడు.
ఇటువంటి వ్యక్తిత్వం ఏ.పి.జె. అబ్దుల్ కలాం లోనే కనిపించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి