ఆంగ్లభాషా వ్యామోహం
ఆంగ్ల మాధ్యమమమ్మే యత్యుంత్తంబనుచున్న
గర్హనీయంపు పల్కు కానిమాట
తెలుగుపలుకెరాని తెలుగుబిడ్డడెపుడు
ఆంగ్లభాష నెటులనాదరించు
ఇంటగెలువకుండ మింటగెల్వతరమె
ఆంధ్రమసలురాక నాంగ్ల మెట్లు
అమ్మభాషయనెడి నమృతమ్మువదిలేసి
ఎంగిలాకుకొరకు యేగ దగునె
ఆ.వే. ఆంగ్ల మాధ్యమంబత్యవసరమనుచు
అలమటించే నేల నాంధ్రులార
తెలుగునుడుల తీపి తెగజుర్రుకొనకుండ
ఆంగ్ల భాష మీకు నర్థ మగునె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి