క్షీరాబ్ది ద్వాదశి
క్షీరాబ్ది శయనుండుశ్రీమహావిష్ణవు
యోగీశ్వరేశ్వరుయోగమయుడు
నిదురయేలేనట్టీ నీరజాక్షుడతడు
భోగీశుపైనంతయోగనిద్రనుచెందు
పావనంబైనట్టి పండుగిదియె
లోకంబులన్నియులోనుంచితానంత
చిన్ముద్రపూనిని చిత్రహింసలు
అందరిలోతానుయంతటాతానుగా
హృదయారవిందాన వుందునతడు
అతడెపో !మనకుయాత్మయనగ
నశ్వరం పునరులనటనవలనకాదె
చిక్కిశల్యమగుట చివర కగును
అఖిలాంతరాత్ముని యశ్రయమందంగా
ఒరులచెంతమనమేలొరగవలయు
అచ్యుతు చరణాలనాశ్రయించునరుల
కంటిరెప్పవలెను కాచునెపుడు
ఆ.వె.నిధులసుఖముకన్న నీరజాక్షునిసేవ
సుఖము నిచ్చు మనకు సుస్థి రమ్ము
కరివరుడతడోయి కారుణ్య మూర్తిగా
నమ్మికొలుచు వారు ధన్యులోయి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి