లోకమాన్యడు

లోకమాన్యుడితడు లౌక్యమసలులేని
ధీరవరుడితడు ధైర్యశాలి
స్వాతంత్ర్య మేనాదు సహజమౌహక్కుంచు
సింహనాదముచేయు సింగమోయి
కర్తవ్య నిర్వాహకర్మయోగమ్మును
నిష్టగా పాటించు నిపుణుడితడు
 గీతారహస్యజేగీయుమానుండుగా
మన్ననలందిన మాన్యుడితడు
గణపతి నవరాత్రి కారణభూతుండు
స్వాతంత్ర్య సారధ్య సాధకుండు
ఆ.వె.బాలగంగధరుడు భరతాంబబిడ్డడు
దేశభక్తియుతుడు ధీర వరుడు
వీరపుత్రుడితడు విప్లవ సింహము
గణితశాస్త్రవేత్త కర్మయోగి
(రచన:--విద్వాన్ గొల్లా పిన్ని నాగరాజు శాస్త్రి)
([బాల్యం నుంచి నన్ను ఆకట్టుకొన్న  దేశభక్తి వరుడు.మా అన్న తెలుగు ఉపవాచకంలో ఇతని సంక్షిప్త జీవిత చరిత్ర చదివాను]

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత