కాలపాశము
కాలపాశమట్లు కన్పించు ముచ్చటల్
తప్పదెవరికైన దశలు మూడు
పెండ్లి పుట్టుకైన పిదపచావైనను
మాన్పతరమెజగతిమనకునెపుడు
శ్లో|| త్రయః కాలకృతాః పాశాః శక్యన్తే న నివర్తితమ్।
వివాహో జన్మ మరణం యథా యత్ర చ యేన చ॥
తా|| *వివాహము, జన్మ, మృత్యువు ఈ మూడు కాలపాశములు*.
ఎప్పుడు ఎక్కడ ఎవడిచే అనుభవించబడవలెనో అప్పుడు అక్కడ అతడు అనుభవించవలసినదే!
*ఇవి మార్చడానికి అసాధ్యమైనవి*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి