లలితమ్మ తల్లి
లలితమ్మ తల్లియె లాలిత్య భావంబు
అందించి రక్షించు యనవరతము
చిదగ్ని కుండాన చైతన్య మూర్తిగా
అవతారమందిన అమృతమూర్తి
దుష్టసంహారమ్ము శిష్టరక్షణమెపుడు
కావించు దీవించు కరుణ శీల
సర్వజీవులకెల్ల శక్తి నొసగు
భక్తజనులకెల్ల భయమునుపోగొట్టి
కనురెప్ప వలెనట్లు కాచు తల్లి
నీదు పదము లంటి నిరతమ్ము ధ్యానించు
చిత్త శుధ్ధి నిమ్ము చివరి వరకు
చపల చిత్త మతికి చాపల్య మెక్కువ
నన్న బ్రోవ నీవ నాకు దిక్కు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి