అఖిలాత్మురాత్ముడే ఆత్మయై యుండగా
అఖిలాంతరాత్ముడే నాత్మమై యుండగా
అతడెక్కడనుచు నడుగ దగునె
ప్రాణంబు లైదును పరివార మైయుండ
పనివారి కొరకునై పాటులేల
(దేహమే నీకింక దేవళంబై యుండ
గుడిగోపురమ్మంచు కుందనేల)
దేహాన్ని నీవింక దేవాల యముసేయ
పరమాత్మ రూపమై పరవసించు
గాఢమౌ నిద్రయే ఘనసమాధియనుచు
నిద్రలో లీనమై నిలిచియుండు
(నిద్రించు నిద్రయే నిర్వాణ గే సుఖమంచు
నీవింక భావించు నిశ్చయాన)
విషయోప భోగాలు విశ్వేసు పూజగా
భావింతు నేనంత భావమందు
సంచారమంతను సాంబశివునకును
ఆత్మప్రదక్షణంబగునుకాదె
నేనేమి చేసినా నీలకంఠునిపూజ
నిరతంబు చేయుటె నిశ్చయమ్మ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి