మన ప్రయయోజకత్వం

జననమందితివయ్య జననీజనుకులచే
నీదుఘనతలేదు నిక్కమిదియె
అమ్మానాన్నలచేతనామమొకటిగల్గె
నీదుఘనతలేదు నిజము కనుము
ఒజ్జలొసగినారు వోర్మతో విద్యను
నీదుఘనతలేదు నిజముసుమ్ము
పదవియొదిగినీకు పరులవలనకాదె
పదవివలననీకు పైక మబ్బె
పరువుమర్యాదలు ప్రఖ్యాతి యంతయు
సంఘంబువలనను సంఘటిల్లె
ఆ.వె.ఆస్తిపాస్తులెల్ల యన్యులపాలౌను
ఊపిరాగగానెనూడ్చినట్ల
గర్వం పడుట యేల ఘనమైన వాడంచు
బుద్బుదంబు బ్రతుకు బుగ్గిపాలు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత