మనసే సర్వకారణం

మదియెహేతువగును మనలొని జగతీకి
మదియెపగతుడగునుమహిని సుమ్ము
మనసుకన్నలేదుభవబంధహేతువు
మదియె లోకత్రయపు  మాన్యతగును
*శ్లోకం*

మన ఏవ జగత్సర్వం
మన ఏవ మహ రిపుః|
మన ఏవ హి సంసారో
మన ఏవ జగత్త్రయమ్||

(సుభాషితరత్నావళి)

*తాత్పర్యం*

ఈ మనస్సే సర్వజగత్తున్నూ; మనసే పరమశత్రువు; అదియే సంసారహేతువు; అదే మూడు లోకములూ కూడను అగుచున్నది. మనస్సును స్వాధీనము గావించుకొనుచో జగములన్నీ స్వాధీనమై ఉండును.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత