బయలుదేరెనదిగో భలభద్రురథమూ
బయలుదేరె నదిగొ భలభద్రు నరదంబు
దుష్టజనులనెల్ల దునుము నింక
మనకుభద్రమొసగ మనసుభద్రమ్మయె
దర్పధళన మెక్కి తరలె నింక
జనులుబ్రోవ వెడలె జయజగన్నాథుడు
నందిఘోష రథమందు సుంద రుండు
దేహమ్ము రథమాయె దేహియే దేవుండు
గీతార్థ మెరిగించు సత్యమిదియె
ఆ.వే.జయము జయము నీకు జయజగన్నాయకా
నాటకాన మేము నటుల మయ్య
రక్తికట్టునటుల భక్తినొసగుమయ్య
తప్పులనుచు మమ్ము తన్న బోకు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి