వెలుగుల దేవర

వినువీధి వెలిగించు వేల్పుల దేవర
మిన్నేటీ కలువట్లు మెరసె నోయి
నింగికీ నేలకు నెయ్యంబు కూర్చగా
నెచ్చలి యట్లుగా వచ్చె నోయి
వానల్లు కురిపించి వరదల్లు పారించి
పంటల పండించి బ్రతుకు నిచ్చు
జిల్లెడు పూలతో చెలువార కొల్వగా
మదిలోన తానంత మురిసి పోవు
ఒంటి చక్ర మున్న వయ్యారి తేరెక్కి
బ్రతుకు చూపు నట్టి బాటసారి
దండ మిడిన చాలు దయచూపు దేవర
తెవులు మాన్పు కలుగు దేవు డతడు
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత